జిల్లా ఆస్పత్రి సందర్శించిన వికారాబాద్‌ ఎమ్మెల్తే - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

జిల్లా ఆస్పత్రి సందర్శించిన వికారాబాద్‌ ఎమ్మెల్తే


వికారాబాద్‌ జిల్లా (శుభ తెలంగాణ) : వికారాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో వెంటిలేషన్‌ ఆక్సిజన్‌ ఇతర పరికరాలు కూడా నాణ్యమైనవి ఏర్పాటు చేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే దాక్టర్‌ ఆనంద్‌ అధికారు లను సూచించారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ నిర్మించనున్న నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అన్ని రకాల పరికరాలు నాణ్యమైన ఏర్పాటు చేసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించా రు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని జిల్లా ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సదుపాయాలు ప్రైవేటుకు ధీటుగా అందించాలని ఆయన సూచించారు ఆస్పత్రి పరికరాలు అన్ని రోగాలకు సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు అందుకు జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఐటీ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి అన్ని సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని ఆయన ఉన్నారు నగరంలోని ఉస్మానియా గాంధీ లకు వెళ్లకుండా జిల్లా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌ షిండే స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల రమేష్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మాజీ చైర్మన్‌ ఎండి హఫీజ్‌ స్థానిక కౌన్సిలర్‌ మున్సిపల్‌ శాఖ అధికారులు వైద్యాధికారులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.