హైదరాబాద్,జూలై 24(శుభ తెలంగాణ): ఐటీ, పురపాలక, శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సెట్టర్ అని, యూత్ ఐకాన్‌గా అందరిని ఆకర్షిస్తూ రాష్ట్ర ప్రగతికి తన వంతు కృషి చేస్తున్న కార్యదక్షుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిసి మొక్కను అందజేసి పుట్టినరోజు శు భాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ... కేటీఆర్ మంత్రిగా, టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా సక్సెస్ అయ్యారన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకునే యూత్‌కి కేటీఆర్ ఐకాన్‌గా మారారన్నారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తనదైన శైలిలో కేటీఆర్ తనకార్యదక్షతను చాటుకుంటున్నారని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం సుదీర్ధంగా సాగాలని, నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ,ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, గాయత్రి రవి తదితరులు ఉన్నారు. అంతకుముందు కెసిఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.