కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయండి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 08, 2020

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయండి..

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయం కూల్చివేతపై మంగళవారం రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ పిలిచినా రాకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.
వెంటనే సీఎస్ తోపాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని విధుల్లోంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపైనా రేవంత్ మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్‌కి ప్రభుత్వ అధికారులు
స్పందించకపోతే కేంద్రమంత్రి కలగజేసుకోవాలని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్
హైదరాబాద్ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌస్‌కి వెళ్లిపోయారని మండిపడ్డారు.
పీవీ శతజయంతి రోజు మాయమైన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కూడా కనిపించలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అఖిలపక్షాన్ని పిలవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా? అని రేవంత్ ప్రశ్నించారు.