భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (శుభ తెలంగాణ) : కరోనా (కోవిడ్ 19)ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రాథమిక వైద్య శాల యందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం క్వారన్టైన్లో ఉండి పాలన సాగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కోవిడ్ 19 విజృభిస్తూ ఈ మహమ్మారి వల్ల వందల మంది ప్రాణాలు కోల్పో తున్నారని అయిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరిస్తు దని దుయ్యబట్టారు. కరోనా వైరస్ రోజురోజుకి కేసులు పెరిగి పోతుండడంతో డాక్టర్లు, పోలీసు లు, ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కరోనా వైద్య పరీక్షలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేవిధంగా చేయాలన్నారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని పినపాక పి హెద్ సి మొబైల్ దాక్టర్ సురేష్, వైద్యాధికారి సంజీవరావు లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు రమేష్, శ్యామల పూస 'థ్రీను తదితరులు పాల్గొన్నారు.