దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు కంపెనీలు, డీజిల్ ధరను 12 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 81.64కు చేరింది. పెట్రో ధరలు యధాతథంగా ఉండటంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.80.43గా ఉన్నది. అంటే పెట్రోల్ కంటే డీజిల్ ధర రూ.1.21 ఎక్కువ. జూన్ 7 నుంచి వరుసగా 22 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే జూన్ 29 నుంచి పెట్రోల్ ధరను మార్చకుగా, డీజిల్ ధరను మాత్రమే చమురు కంపెనీలు పెంచాయి. మళ్లీ గత ఐదు రోజుల నుంచి వరుసగా డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )