కరోనాని కట్లడి చేదాం.. ప్రభుత్వవిప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

కరోనాని కట్లడి చేదాం.. ప్రభుత్వవిప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు జూలై 29 (శుభ తెలంగాణ): రోజు రోజుకి విస్తరిస్తున్న మహమ్మారి కరోనాను అందరి కలిసి కట్టడి చేయాలని 'ప్రభుత్వవిప్‌, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని స్ప్రే చేయించాలని, ప్రజలకు అండగా, ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి కుటుంబంతో ప్రజాఫ్రతినిధులు అందుబాటులో ఉ ండాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యకిగత ,పరిసరాల పరిశుభ్రత పాటించేందుకు అవగాహన కల్పించాలన్నారు. కనిపించని, 'మహామ్మారితో పోరాటం చేస్తున్న ప్రజలకు ధైర్యం నింపాలన్నారు. ప్రజలు భయందోళనకు గురికావల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా టుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం విజయకుమారి, తహసీల్దార్‌ లూదర్‌ విల్సిన్‌, జెట్సిటిసి పోశం నర్సింహారావు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.