హోం ఐసోలేషన్ కు కవిత... ఆమె కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

హోం ఐసోలేషన్ కు కవిత... ఆమె కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ


హైదరాబాద్, జూలై 24(శుభ తెలంగాణ) నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్య మంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పనిచేసే డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో వైద్యుల సూచ నల మేరకు ఆమె హోంబసోలేషన్ లోకి వెళ్లారు మందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆమె క్వారెంటైన్ పాటిస్తున్నట్లు కవిత సన్నిహిత వర్గాలు వెల్లడిం చాయి. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. నిజామాబాద్ కు చెందిన మేయర్ దంపతులు,ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా వారు చికిత్సలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది