మధ్యప్రదేశ్‌ సిఎం చౌహాన్‌కు కరోనా - క్వారంటైన్‌కు వెళ్లిన శిరాజ్‌ సింగ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

మధ్యప్రదేశ్‌ సిఎం చౌహాన్‌కు కరోనా - క్వారంటైన్‌కు వెళ్లిన శిరాజ్‌ సింగ్‌


భోపాల్‌, జూలై25 : ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా ఏ ఒక్కరినీ వదిలి పెట్ట డం లేదు.మధ్యప్రదేశ్‌ సీఎంశివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. కరోనా లక్షణాలు ఉండటంతో లే పరీక్షలు చేయించు కున్నాను. పాజిటివ్‌ అని తేలింది. నాతో ్‌్‌్‌్‌ అయిన ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. వారందరూ క్వారం టైన్‌లోకి వెళ్లిపోండని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతానని చెప్పారు. మన దేశంలో కరోనా బారినపడ్డ మొదటి సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహానే కావడం విశేషం