కూకట్‌ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

కూకట్‌ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు


మేడ్చల్‌ జిల్లా (శుభ తెలంగాణ) : కూకట్‌ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఓ గార్డెన్‌ లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధి తో బాధపడుతున్న వారికి సహాయం కోసం సైబరాబాద్‌ సి.పి సజ్జనార్‌ ఆదేశాలతో మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సిఐ లక్ష్మీ నారాయణ రెడ్డి రక్తదానం చేయగా పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిసిపి వెంకటేశ్వర్లు, ఏసిపి సురేందర్‌ రావు, డిటెక్టివ్‌ ఇన్సెక్టర్‌ 'థీనివాస్‌ రెడ్డి, ఎస్సైలు సురేష్‌, రవీందర్‌ రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.