కొత్త సెక్రటేరియట్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలి - సీఎం కేసీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 31, 2020

కొత్త సెక్రటేరియట్‌లో అన్ని సౌకర్యాలు ఉండాలి - సీఎం కేసీఆర్


హైదరాబాద్‌ (శుభతెలంగాణ) కొత్త సెక్రటేరియట్‌ భవన నిర్మాణంపై సీఎం ఇవాళ ప్రగతి భవన్‌ లో సమీక్ష నిర్వహించారు. నూతన సెక్రటేరియట్‌ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వీటిలో పలు మార్చులను సూచించారు. సెక్రటేరియట్‌ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్‌ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్‌ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలని, ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు, మీటింగ్‌ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాలు, వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉ ండేలా నిర్మాణం ఉండాలని సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంఓ అధికారులు తదితరులు పాల్గొనారు.