ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలి ...! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలి ...!

కడప జిల్లా (శుభ తెలంగాణ) రాష్ట్రంలో ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం లో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇసుక కుంభకోణం అని, దీనిపైన సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్‌ చంద్రశేఖర్‌, సోమవారం, రైల్వేకోడూరు విలేకర్ల సమావేశం లో డిమాండ్‌ చేశారు. ఇప్పటికే దీనిపైన విచారణ జరపాలని ఏపీఎండీసీ చైర్మన్‌ గోపాలకృష్ణ దివ్య కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా సిఐటియు మొదటి నుంచి డిమాండ్‌ చేసినట్లు శాండ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏపీ ఎండిసి, ఎండిగా పనిచేసిన మధుసూదన్‌ రెడ్డి నీ ఎందుకు ఎనిమిది నెలలు బదిలీ చేశారని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల యాదయ్య, అవ్వాజ్‌, మండల కన్వీనర్‌ పి.మౌలాలి భాష పాల్గొన్నారు.