తెలంగాణ సర్కారుకు హైకోర్టు చురకలు! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

తెలంగాణ సర్కారుకు హైకోర్టు చురకలు!


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టుమరోసారి చురకలు అంటించింది. ప్రజలకు సమాచారం అందిం చాలని హైకోర్టు చెప్పినా ఎందుకు పాటిం చడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్స్‌ ఉన్నాయి... ఎన్ని వెంటి లెటర్స్‌ ఉన్నాయి... ఎంత మంది చికిత్స పొందుతున్నారు... అనే సమాచారం ఇవ్వాలని కోరింది.పత్రికల్లో ప్రతిరోజున్యూస్‌ ఏజెన్సీ ద్వారా ప్రజలకు అ కరోనా సమాచారం తెలపాలని ఆదేశించింది. ఐపీఎల్‌  క్రికెట్‌ మ్యాచ్‌కు ఏవిధంగా పట్టిక . వేసి హెడ్‌లైన్స్‌లో / చూపుతారో అదే తరహాలో కేసుల వివరాలు చూపా లంది. హెల్త్‌ బులిటెన్‌లో తప్పులు ఇస్తే ఉ రుకోబోమని హెచ్చరించింది. కోర్ట్ఆదేశాలమేరకు ప్రతిరోజు సమాచారం ఇస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు సమాచార హక్కు కమిషనర్‌ అరవింద్‌కు సీఎస్‌ ఆదేశాలు జేరిచేసారు. ప్రయివేటు హాస్పిటల్‌ వారు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపడ్డం లేదని కోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌ నుండి మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందని... మారుమూల ప్రాంతాల్లో కూడా కోవిడ్‌తో ప్రజలు చనిపోతున్నారని... కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో టెస్టులు భారీగా చేస్తున్నా తెలంగాణలో ఎందుకు తక్కువగా చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించారు. కాగా డబ్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ గైడ్‌ లైన్స్‌ మేరకు మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్‌ కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సీజన్‌ అందక 38 మంది చనిపోయారన్న కోర్టు... పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా. నివారణ, నియంత్రణ ఎందుకు చేపట్లేదని అధికారులు అడిగింది. కరోనా బులిటెన్‌లో తప్పుల తడకలేంటి.. అధికారులను కోర్టు ప్రశ్నించింది. తమ ఆదేశాలనెందుకు పట్టించు కోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో 1085 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశామని చీఫ్‌ సెక్రటరీ తెలిజేశారు. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కూడా చికిత్స చేస్తున్నామని అధికారులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రయివేటు హాస్పిటల్స్‌కు నోటిసులు ఇచ్చామని సీఎస్‌ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ప్రయివేటు హాస్పిటల్‌ పై నిఘా ఉంచామని సీఎస్‌ వెల్లడించారు. కలెక్టర్లు, పోలీసులు వైద్య అధికారులు అందరూ నిరంతరం కరోనా నివారణకు పాటుపడుతున్నారని సీఎస్‌ అన్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన కేసులు చాలా ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. అయితే కరోనా పై ప్రభుత్వం ఎందుకు విసృత ప్రచారం చేపట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రతి హాస్పిటల్‌ వద్ద ఎలక్ట్రానిక్‌ బోర్డ్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. యాప్‌లు విడుదల చేయడం వలన సామాన్య ప్రజలకు అర్ధం కాదని తెలిపింది. ప్రతి హాస్పిటల్‌ వద్ద డీస్పే బోర్డ్‌ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని సీఎస్‌ కోర్టుకు తెలిపారు. యాప్‌ ను ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సీఎస్‌ కోరారు. పూర్తి సమాచారం యాప్‌లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలలో2 లక్షల రాపిడ్‌ కిట్లు వాడకంలో ఉన్నాయని సీఎస్‌ తెలిపారు. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్‌ చేశామన్నారు. కాగా రాపిడ్‌ కిట్లతో రిజల్ట్‌ 40 శాతం మాత్రమే కరెక్ట్‌గా వస్తుందని కోర్ట్‌ చెప్పింది. దాంతో రాజస్థాన్‌ లో రాపిడ్‌ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేశారని గుర్తుచేసింది. మన రాష్ట్రంలో రాపిడ్‌ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ఆగడాల పై ఇప్పటి వరకు 726 ఫిర్యాదులు అందాయని సీఎస్‌ తెలిపారు. తదుపరి నివేదికలో ఆ 726 ఫిర్యాదులు పై ప్రైవేట్‌ హాస్పిటల్‌ ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 13 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డిహెచ్‌ఎంవో, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ హాజరయ్యారు. టెస్టులు, ఆస్పత్రుల్లో చికిత్స సహా పలు వ్యాజ్యాలపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరుపుతోంది.‌