శవాలను కూడా వదలని కార్బో'రేట్లు”! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

శవాలను కూడా వదలని కార్బో'రేట్లు”!


హైదరాబాద్‌ ప్రతినిధి, జూలై 09(శుభ తెలంగాణ): శవాన్ని పీక్కుతునే కుక్కలన్నా నయం...శవాలను పీక్కుతినే రాబందులు నయం... అడవుల్లో జంతువులను వేటాడే పులులు, సింహాలు నయం...శవాలపై 'పేలాలు ఏరుకునే తినేవారు సైతం కూడా నయమే. కానీ మన ప్రైవేట్‌ ఆస్పత్రులు మాత్రం శవాలను, రాబందులను, కుక్కలను కూడా పీక్కుతినే రాబందులకన్నా దారు ణంగా వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకోవల్సిందే. వైద్యవృత్తితో సమాజంలో మంచి 'పేరు తెచ్చుకుని ప్రజల ప్రాణ 'దాతలుగా నిలవాల్సిన వారు కరోనా మహమ్మారి కారణంగా. అధ్వాన్నంగా తయారయ్యారు. అంతకుముందూ వారు నిజాయితీ గా లేకున్నా.కనీసం ఈ కష్టకాలం లో అయినా వారు సామాజికి బాధ్యతగా వ్యవహరించి ఉంటే మంచిపేరు వచ్చేది. కానీ వారికి వైద్య సేవలతో సంపాదించే పేరు కన్నా. పీక్కుతినడం వల్ల వచ్చే డబ్బుపైనే మక్కువని తేలిపోయిం ది. దొంగబిల్లులు, అనవసర బిల్లలుతో కరోనా చికిత్సల కోసం వచ్చిన వారిని పీక్కుతింటున్న తీరు దారుణం కాక మరోటి కాదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి రూ. లక్షల్లో బిల్లు లు వసూలు చేస్తున్నాయి. వారు వేసే బిల్లు చూస్తే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆక్సిజన్‌ పెట్టక పోయినా పెట్టినట్లు బిల్లు వేస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ ప్రభుత్వ వైద్యురాలికి ఒక రోజు కే రూ.1.15 లక్షల బిల్లు వేసిన ఘటన మరవక ముందే మరో సంఘటన గచ్చిబౌలి ఏఐజీ ఆస్ప త్రిలో జరిగింది. డాక్టర్‌ అయిన కేసరి విజయ బిల్లులో అవకతవక లు, ఆస్పత్రి దౌర్జన్యంపై ఆమె వీడియో తీసి సోషల్‌ మిడియాలో పెట్టారు. ఇదెక్కడి న్యాయం, మాకు సాయం చేయండంటూ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. వీడియోలో ఆమె మాట్లా డుతూ అక్కడ జరుగుతున్న అకృ త్యాలు, తనకు జరిగిన అవమానా లను తెలియచేశారు. కొవిడ్‌-19 పరీక్షలు చేసి పాజిటివ్‌ వచ్చిందని చెప్పడం... చికిత్స పేరుతో లక్షల్లో బిల్లుల వసూలు చేయడం ఎంత వరకు సమంజసమో ఆస్పత్రి యాజామాన్యం చెప్పాలి. వీళ్ల వ్యాపారధోరణి చూస్తే అసలు వీళ్లు మనుషులేనా అని... మానవ త్వం ఉందా అనిపిస్తుంది. సమా జంలో మంచి డాక్టర్లుగా పేరు తెచ్చు కోవడం, అవార్డుల కోసం పైరవీలు చేయడం... ఆస్పత్రులు కట్టుకుని ప్రజలను పీడించి వసూలు చేస్తున్న ఈ డబ్బు జబ్బు తో వారు కరోనా వ్యాధి సోకిన వారికన్నా అధ్వాన్నంగా చావాలని కోరుకుందాం. ప్రభుత్వ ఆస్పత్రు లు నానాటికి తీసికట్టుగా తయార వుతున్న వేళ ప్రైవేట్‌ ఆస్పత్రులపై నమ్మకంతో వచ్చిన పేషెంట్లను జలగల్లా పీల్చి కొందరు..శవాలు ఇవ్వకుండా కొందరు... చేస్తున్న వ్యాపారాలు చూస్తుంటే వైద్యవృత్తి ఎంతగా దిగజారిందో గమనించ వచ్చు. చేయని వైద్యానికి ఎందుకు డబ్బులు చెల్లించాలి. కరోనా లక్షణాలు లేకపోయినా వైద్యం చేసినట్లు ఎందుకు బుకాయించా లి. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక పోవడం, పైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాపార ధోరణి చూస్తుంటే నభ్య సమాజంలో ఉన్నామా అన్న ఆందోళన కలుగుతోంది. ఇది, ప్రభుత్వాలకు తీరని మచ్చ. ప్రజల కోసమే పానల చేస్తున్నామని చెప్పకుంటున్న వారు తలదించు కోవాలి. ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత హేయమైన చర్యగా భావించి తగు చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో కరోనా విజృంభణతో పరిస్థితి చేయి దాటి పోతుంది. ప్రైవేట్‌ ఆస్పత్రిలో దోపి డీ ఎక్కువ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌తో కొంతకాలంగా. స్తబ్బుగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు కరోనా పేషెంట్ల శవాల మిద వ్యాపారం చేస్తున్నా రు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై స్వయంగా కల్పించుకు ని సమిక్ష చేసినా మార్పు రాలేదు. ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు తమ వ్యాపార ధోరణి వీడలేదు. వీలైనం తగా ప్రజలను భయపెట్టి డబ్బు గుంజాలన్నా పైశాచిక బుద్దిని వీడ లేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇలాం టి సంఘటనలు అన్నీ సిఎంగా కెసిఆర్‌ మాత్రమే చూడాలని లేదు. అధికారులు చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా చేయడం లేదు.కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభణ చేస్తోంది. ఆయా. దేశాలు, రాష్ట్రాలు కట్టడికి తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్క డయితే కఠిన చర్యలు తీసుకుంటు న్నారో కరోనా వ్యాప్తి అక్కడ తగ్గు ముఖం పడుతోంది. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. మరో వైపు గాలిద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న ప్రముఖుల హెచ్చరికలు ఆందోళన కలిగిం చేలా ఉన్నాయి. ప్రమాద ఘంటిక లు మోగుతున్న వేళ ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు తమకు వైరస్‌ అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దశలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అరం కాలాక కను సరసు న్నాయి. డబ్బు గుంజడమే లక్ష్యం గా వారు పనిచేస్తున్నారు. వాళ్లు వేసే బిల్లు కట్టనిదే పేషెంట్లను బయటకు పోనివ్వడం లేదు. శవాలను కూడా బంధువులకు అప్పగించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గాంధీ ఆస్పత్రి ఇప్పటికే గందరగోళంగా మారి కరోనా రోగులు అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చిందన్న ఆరోవణలు ఉన్నాయి. అక్కడ సరైన వసతులు లేవంటు న్నారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు సెల్ఫీ తీసుకొని తమను అక్కడినుంచి తరలించమని ఏకం గా మంత్రులకే విజ్ఞప్తిచేస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జోక్యం తో ఒకరిద్దరికి బెడ్డు ఇప్పించ వలసింది వచ్చింది. తాజాగా ఒక జర్నలిస్టు ఆవేదన భరితమైన సెల్ఫీ వీడియో చూసి ఆర్థిక మంత్రి మంత్రి హరీష్‌రావు స్వయంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అతడిని చేర్చించారు. ఇవన్నీ రోగుల దయనీయమైన పరిస్థితిని ఇలవుకున్యంి తకుక్వ ఏద్వం సరిగా అందకపోవడంతో డబ్బు లు ఉన్నవాళ్లు కూదా అటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని తట్టుకోలేక పోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు ఇదే అదనుగా వైద్యం పేరుతో సేవల ను అమ్ము కుంటున్నారు. ప్రాణా లు కాపాడాల్సిన వారే నిర్జాక్షణ్యం గా డబ్బుల కోసం కక్కుర్తి పడితే ఇక ప్రజలు ఏం చేస్తారు. ప్రైవేట్‌ ఆన్బత్రుల దాష్టీకంపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిం చాలి. నిర్ణయించిన రేట్లకే వైద్య 'సేవలు అందేలా చూడాలి. లేకుంటే ఏదో ఒకరోజు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తుంచుకోవాలి.