కరోనాతో ఎఎస్ఐ మృత్యువాత - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

కరోనాతో ఎఎస్ఐ మృత్యువాత


ఆదిలాబాద్,జూలై 23(శుభ తెలంగాణ) కరోనాకు మరో పోలీస్ మృత్యువాత పడ్డాడు. జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన నజీబ్ మహ్మద్ ఖాన్ (46) పట్టణంలోని వన్ టౌన్ లో ఏఎస్ ఐగా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం చాతి నొప్పితో అస్వస్థకు గురైన ఏఎస్ ఐ చికిత్స కోసం రిమ్స్లో చేరాడు చికిత్స అందించిన డాక్టర్లు ముందు జాగ్రత్తలో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించా రు. గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన మహ్మద్ ఖాన్ మరణిం చారు. సేకరించిన నమూనాల షాంపిల్స్ రిపోర్ట్స్ రాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావా ల్సిన పనిలేదని, జాగ్రత్తలు పాటించి అధిగమించ వచ్చని వైద్యులు సూచించారు