కరోనా సంక్షోభంలోనూ నిరుపేదల అండగా నిలుస్తున్న ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

కరోనా సంక్షోభంలోనూ నిరుపేదల అండగా నిలుస్తున్న ప్రభుత్వం


కుత్చుల్లాపూర్‌, జూలై 09(శుభ తెలంగాణ) : కరోనా సంక్షోభంలోనూ పేదల సంక్షేమానికే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని కుత్చుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ అన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభం ఉ న్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేస్తూ పేదలను ఆదుకుంటుందన్నారు. కుత్స్చుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది నిరుపేదలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ రూ. 17,90,500 విలువ గల చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిది పథకం కింద ప్రభుత్వం ద్వారా మంజూరీ చేయించి పేట్‌ బషీరాబాద్‌ లోని తన క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఇప్పటికే సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం 'పేరుగాంచిందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.