ఉస్మానియా ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు : భారీ వర్షానికి ఆస్పత్రు ల్లో నీరు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 16, 2020

ఉస్మానియా ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు : భారీ వర్షానికి ఆస్పత్రు ల్లో నీరు


శుభ తెలంగాణ (జూలై ,15, 2020 ), హైదరాబాద్  : ఉస్మానియా ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొ న్నాయి. భారీ వర్షానికి ఆస్పత్రు ల్లో నీరు చేరింది. డ్రైనేజీ నీటితో వాన నీళ్లు కలిసిపోయాయి. అనూహ్యంగా నీళ్లు చేరడంతో వార్డులన్నీ నీటిలో తేలుతున్నట్లు గా ఉంది. ఈ పరిస్థితినిచూసిన రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఆస్పత్రుల్లో మురుగు నీటి వ్యవస్థ దారుణంగా ఉందని ఆరోపిస్తు న్నారు. నీటిలో నుంచి వచ్చి వైద్యం చేయడానికి సిబ్బంది నిరాకరించారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంతంలో నిజాం కాలం నాటి దైైనేజీ ఉంది. ఆస్పత్రిని ఆధునీకరిస్తామని కూల్చి వేసి కొత్తది నిర్మిస్తామ ఇ. న్నారు. కానీ ఇంతవరకూ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆస్పత్రి సురక్షిత ప్రాంతంలో లేదనే వాదన వినిపిస్తోంది. వర్షాలు వస్తే చాలు గేటు లోపలికి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇదిలావుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, జేఎన్‌ టీయూ, ప్రగతినగర్‌, ఉప్పల్‌, నాగోల్‌, ఈసీఐఎల్‌, చిక్కడపల్లి, బాలానగర్‌లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.