హరితహారంలో మొక్కలు నాటిన బూర్గం పాడు ZPTC కామిరెడ్డి శ్రీలత - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 23, 2020

హరితహారంలో మొక్కలు నాటిన బూర్గం పాడు ZPTC కామిరెడ్డి శ్రీలత


బూర్గంపాడు(శుభ తెలంగాణ):తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్త గూదెం జిల్లా, బూర్గంపాడు మండలం క్రిష్ణసాగర్‌ నాగినేని ప్రోలు రెడ్దిపాలెం గ్రామ పంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతంలో బూర్గం పాడు ZPTC కామిరెడ్డి శ్రీలత బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడద్బీటీసీ మాట్లాడుతూ ప్రజలంతా హరితహారం కార్య క్రమంలో భాగస్వాములై మొక్కలను నాటి, నాటిన ప్రతి మొక్కను పరి రక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్క బతికితే రాష్ట్రంలో అడవులు పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు కోడిమె వెంకటేశ్వర్లు, భూక్యా శ్రావణి మండల ప్రత్యేక అధికారి డి.చంద్రప్రకాష్స్‌ ఎంపీడీఓ రామకృష్ణ ఉపసర్పంచులు సాందే గోవింద్‌, యడమకంటి రూన్సీరాణి, ఏపీవో శ్రీలక్ష్మి, ఈసీ నవీన్‌, పంచాయతీకార్యదర్భులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.