టీవీ రావు హఠాన్మరణం బాధాకరం - సంతాపసభలో మంత్రి పువ్వాడ నివాళి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

టీవీ రావు హఠాన్మరణం బాధాకరం - సంతాపసభలో మంత్రి పువ్వాడ నివాళి


హైదరాబాద్‌,జూలై16(శుభ తెలంగాణ):టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) టీవీరావు హఠాన్మరణం బాధాకరమని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఆయన సేవలు మరువలే మన్నారు. గురువారం నిర్వహించిన సంతాప సభలో మంత్రి మాట్లాడు తూ... రావు హఠాన్మరణం జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా సభలో ఆయనకు ఘనంగా నివాళులు అర్చించారు. సంస్థలో చేపట్టిన అధికార బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహించడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆయన ఏర్పరుచుకున్నారని మంత్రి తెలిపారు. డిపో మేనేజర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఉ న్నత బాధ్యతలు చేపట్టి వాటికి వన్నె తీసుకొచ్చిన రావుగారు అసువులు బాయటం అందరిని కలచి వేసిందని పువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ బాగుకోసం విధి విధానాల విషయంలో తన అధికార పరిధిలో నిర్మాణాత్మక చర్యలు తీసుకునే వారని, ఆయన సంస్థకు అందించిన 'సేవలు మరవలేనివన్నారు. సంస్థ పురోభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవటం బాధాకరం అని మంత్రి అన్నారు.