కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌లో మార్పులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌లో మార్పులు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌లో మార్పులు చేశారు. కరోనా రోగుల పట్ల గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ..ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన ఆహారాన్నిఅందించాలని మరోసారి సీరియస్‌గా ఆదేశించింది. ఈ మేరకు కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌ను మార్చారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. వారికి ఇచ్చే డైట్‌ను పరిశీలించినట్లయితే…
* ఉదయం 7.30గంటల నుంచి 8.00 గంటల మధ్య అల్పాహారంగా ఇడ్లీ, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పం లలో ఏదో ఒకదానితో పాటు పాలు అందిస్తారు.
* ఉదయం 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు.
* మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండు, కూర, మినరల్ వాటర్ బాటిల్‌ను ఇస్తారు.
* సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతో పాటు ఖర్చూరం, బాదంపప్పు, ఆంజీర్ ఇస్తారు.
* రాత్రి డిన్నర్‌లో అన్నంతో పాటు కూర, సాంబారు, పెరుగు, పప్పు, మరో కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ అందజేస్తారు.
ఇక ఆస్పత్రిలోని వైద్యులు, పారిశుద్ద్య సిబ్బంది, వార్డు బాయ్స్, నర్సులకు కూడా ఇదే డైట్‌ను ఇస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.