మణుగూరు లో ఉద్రికత్త పరిస్థితి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

మణుగూరు లో ఉద్రికత్త పరిస్థితి

మణుగూరు జూలై 29 (శుభ తెలంగాణ): కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని టిఆర్‌ఎస్‌ పార్టీ అక్రమించుకున్నదని, ఈ సమస్య పరిష్కరించేందుకు సిఎల్పి నాయకులు మల్లు భట్టీ విక్రమార్క మణుగూరు వస్తున్న సందర్భంగా ఉద్భకత పరిస్థితి నెలకొన్నది. టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ కార్యాలయం ముందు వుండగా పోలిసులు పహార కాశారు. ఒక వైపు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆవేశంతో కార్యాలయాన్ని అక్రమించుకుంటున్నారని వినికిడి రావడంతో పోలిసులు భారీగా మోహరించారు. భట్టీ విక్రమార్మ మణుగూరు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి మున్సిపాల్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. 2019 వరకు కాంగ్రెస్‌ పార్టీతోనే రశీదు వున్నదని, ఇప్పుడు ఇంటి పన్ను చెల్లిస్తాము రశీదు ఇస్తారా అని భట్టీ అడగ్గా వివాదస్పద సమయంలో ఇవ్వలేమని ఆయన తెలిపారు.