నేనే రాజు ... నేనే మంత్రి : ఎమ్మెల్యే రాజయ్య - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

నేనే రాజు ... నేనే మంత్రి : ఎమ్మెల్యే రాజయ్య


జనగామ జిల్లా (శుభ తెలంగాణ) : జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం ఎంఎల్‌ఏ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన చిల్చూర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా దాక్టర్‌ తాటికొంద రాజయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రమశిక్షణ గలా పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది టిఆర్‌ఎస్‌ పార్టీ అని అధికారాలు పదవులు ఏవి శాస్వితం కాదు అన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవేళలని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని మనసు మార్చుకోవాలని పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎన్ని సార్లు హెచ్చరించిన పద్దతి మరలేదని కావున పార్టీ వ్యతిరేకంగా నడుస్తున్న కారణంగా పార్టీ క్రమశిక్షణ మేరకు కేశిరెడ్డి మనోజ్‌ రెడ్డి మరియు పార్టీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ అప్రతిష్ట కు కారణమైన ఎడవెళ్లి విజయ లను పార్టీ నుండి బహిష్మరింస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.