మన్యం లో పోలీసుల కూంబింగ్ : మావోయి స్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

మన్యం లో పోలీసుల కూంబింగ్ : మావోయి స్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (శుభ తెలంగాణ) : మణుగూరు రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు  25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా బుధ  వారం ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయి స్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం పోలీసులను చూసి వారికి సంబంధించిన సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.