గాంధీభవన్‌కు కరోనా ఎఫెక్ట్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

గాంధీభవన్‌కు కరోనా ఎఫెక్ట్‌


హైదరాబాద్‌, జూలై 15(శుభ తెలంగాణ): నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో కరోనా  కలకలం మొదలైంది. కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసిన సిబ్బందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారం రోజుల పాటు గాంధీ  భవన్‌ మూసివేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ  సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని శానిిటైజేషన్‌ చేస్తున్నారు. ఇటీవల  పలువురు కాంగ్రెస్‌ నేతలు కరోనా బారినపడి కోలుకున్న విషయం
తెలిసిందే.