నేటి నుంచి..టిమ్స్‌ సేవలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

నేటి నుంచి..టిమ్స్‌ సేవలు

కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అందించేందుకు మరిన్ని బెడ్లను సిద్ధం చేస్తున్నది. ఇందుకోసం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌)ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రైవేటు దవాఖానలోనూ ప్రత్యేక బెడ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. టిమ్స్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎస్‌ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. 
అంతకుముందు బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అధికారులు, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలతో విడివిడిగా భేటీ అయ్యారు. అనంతరం వైద్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. సత్వర వైద్యం, పరీక్షల నిర్వహణ, కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ విధానం ద్వారా వైరస్‌ కట్టడిచేయాలని నిర్ణయించారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తూనే.. పాజిటివ్‌ వచ్చినవారికి తక్షణం వైద్యమందించేలా దవాఖానలను సిద్ధం చేస్తున్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నవారికి ఇంటివద్దే వైద్యమందించడంతోపాటు, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేయడం, వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారిని నిత్యం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

Post Top Ad