గాంధీనగర్‌లో హరితహారంలో మొక్కలు నాటిన కార్పొరేటర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

గాంధీనగర్‌లో హరితహారంలో మొక్కలు నాటిన కార్పొరేటర్‌


మేడ్చల్  ‌ జిల్లా(శుభ తెలంగాణ) : గురువారం కాప్రా సర్కిల్‌ ఏఎస్‌ రావ్‌ నగర్‌ డివిజన్‌ 2 పరిధి లోని సుబ్రహ్మణ్య నగర్‌ కాలనీలోని గాంధీనగర్‌ (కాప్రా డివిజన్‌ 1)కి చెందిన స్మశాన వాటికలో హరితహారంలో భాగంగా సుమారు 300 మొక్కలు ఏఎస్‌రావ్‌ నగర్‌ డైనమిక్‌ కార్పొరేటర్‌ శ్రీమతి పావని మణిపాల్‌ రెడ్డి ఆధ్వ ర్యంలో నాటడం జరిగిందిఅని . ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో భాగంగా తమ డివిజన్‌ను గ్రీన్‌ డివిజన్‌గా అభివృద్ది చేయుటకు కృషిచేస్తున్నామన్నారు. స్మశాన వాటిక అభివృద్ది కొరకు పెండింగ్‌ లో ఉన్న పనులను సెక్యూరిటీ గేట్‌ తో సహా ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఏఇ శ్రీ సంతోష్‌ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మణిపారెడ్డి, భేతాళ బాలరాజ్‌, జిహెచ్‌ఎంసి అధికారులు ఏ.ఇ సంతోష్‌ రెడ్డి, హార్టికల్చర్‌ అధికారి రామ్‌ రెడ్డి ,జవాన్‌ లు జి సత్తయ్య, దశరథ, ఎస్‌ఎఫ్‌ఏ మంజుల, సుబ్రహ్మణ్య నగర్‌ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్‌, గాంధీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు (సీనియర్‌ నాయకులు) ఎన్‌.మహేష్‌, ఉపాధ్యక్షులు (ఏరియా కమిటీ మెంబర్‌) భిక్షపతి, ఉపాధ్యక్షులు జి.సత్యనారాయణ, ఎన్‌.కుమార్‌, జి.నర్సింగరావు, ఎన్‌. శ్రీనివాస్‌ మరియు యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జి. నర్సింగ్‌ రావ్‌, ఎం కనకరాజు, బి రాకేష్క్‌ కే. వెంకట్‌, జి. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు