కరోనా కోరల్లో జర్నలిస్టు లు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

కరోనా కోరల్లో జర్నలిస్టు లు


హైదరాబాద్‌, జూలై 09(శుభ తెలంగాణ): వృత్తిగతంగా ఈ మధ్య జర్నలిస్టు లు కూడా కరోనా బారిన పడు తున్నారు. అనేకమంది వైరస్‌ బారిన పడి ఆందోళనకు గురవు తున్నారు. ఇటీవల టీవీ జర్నలిస్ట్‌ మనోజ్‌ కరోనాతో మృత్యువాత పడ్డారు. తరవాత అనేకమంది. కరోనాతో చికిత్స పొందుతున్నారు. తాజాగా శ్రీనివాసరెడ్డి అనే జర్నలి స్టు కరోనాతో ఇబ్బంది పడుతుండ గా మంత్రి హరీస్‌ రావు చొరవత ఆయనను చికిత్స కోసం ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే మిడియా అకాడమి తరఫున చైర్మన్‌ అల్లం నారాయణ ఇప్పటికే పలువురికి ఆర్థిక సాయం అందిం చారు. అయినా ఇంకా రాష్ట్రంలో అనేకమంది కరోనా బారిన పడి సాయం అందక ఆందోళన చెందు తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం లో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్‌ మోదియా జర్నలిస్ట్‌ కమల్‌ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా ఓ రాజకీయ నేతకార్యక్రమ కవరేజీకి వెళ్లాడు. ఆ తర్వాత పరిణామాల్లో రాజకీయ నేతకు కరోనా పాజిటివ్‌ గా తేలడంతో అనుమానం వచ్చిన జర్నలిస్టు సోదరుడు తాను కూడా స్వచ్చందంగా కరోనా టెస్ట్‌ చేయిం చుకున్నాడు. రెండు రోజుల క్రితం రిపోర్ట్‌ పాజిటివ్‌గా వచ్చింది. ఇక అప్పటి నుండి ఆ జర్నలిస్టు కుటుంబంలో మొదలైన కరోనా కష్టాలు కంటిమిద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాజిటివ్‌ విషయం తెలుసుకున్న భద్రాచలం ప్రభుత్వవైద్యులు కమల్‌ ఇంటికి వచ్చి కొన్ని మందులు ఇచ్చి ఇంటి వద్దనే ఉండమని సూచించారు. సాయంత్రానికి కమల్‌ భార్య, రెండేళ్ల కూతురుకు జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన జర్నలిస్టు సోదరుడు తమ కుటుంబంలోని మిగిలినవారికి కూడా కరోనా టెస్టులునిర్వహించాలని అధికారులకు విన్నవించాడు. ఎవరూ పట్టించుకోక పోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. రెండు రోజులు గడుస్తున్నాస్థానికంగా స్పందన లేకపోవడంతో కుటుంబాన్ని తీసుకుని వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. మాములు 'పేషెంట్‌ కాకపోవడంతో ప్రభుత్వం పంపే అంబులెన్స్‌ కోసం ఆదివారం ఉదయం నుండి ఎదురుచూసాడు. రాత్రి సమయానికి వచ్చిన అంబులెన్స్‌లో తన భార్య, కుతురు గుండెజబ్బుతో బాధపడుతున్న తండ్రిని తీసుకుని భారీ వర్షంలో బయళ్టేరాడు. అంబులెన్స్‌ కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ దగ్గరకు రాగానేటైర్‌ పంక్చర్‌ కావడంతో ఆగిపోయింది. అర్థరాత్రి వర్షంలో ఏంచేయాలో తెలియక అంబులెన్స్‌ను తాత్మాలికంగా మరమత్తులు చేసుకుని సమిపంలో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. సోమవారం ఉదయం అధికారులు వచ్చి భార్య,కుతురుకి కరోనా టెస్టులు చేయాల్సి ఉ న్నందున వారిని కొత్తగూడెంలోనే ఉంచి, పాజిటివ్‌ వచ్చిన కమల్‌ ను హైదరాబాద్‌ వెళ్లాల్సిందిగా కై ఓవైపు చిన్నారి కూతురు, భార్య మరోవైపు గుండె జబ్బుతో బాధపడుతున్న తండ్రిని అక్కడే వదిలేసిన కమల్‌ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి భారంగా బయళల్టేరాడు. ఇలా ఎందరో ఆస్పత్రులకు వస్తున్నారు. ఎవరికి వారు తమకున్న సమాచారాన్ని ఇతరులకు చేరవేసి,తమకున్న పరిచయాలతో ఆదుకోవాల్సి ఉ ంది. తెలంగాణ జర్నలిస్ట్‌ జాక్‌ తమవంతుగా ప్రభుత్వంతో చర్చించే ప్రయత్నాల్లో ఉంది. ఈ మేరకు కన్వీనర్‌ దేవరకొండ కాళిదాస్‌, కో కన్వీనర్‌ అవ్వారు. రఘులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలున్న వారు మిడియా అకాడమి ఛైర్మన్‌ అల్లం నారాయణకు కూడా సంప్రదించి తగిన సాయం పొందితే మంచిది.