దిద్దుబాటు చర్యల్లో సర్కారు! - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 19, 2020

దిద్దుబాటు చర్యల్లో సర్కారు!


హైదరాబాద్‌, జూలై 18(శుభ తెలంగాణ): కరోనాపై దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. పెరుగుతన్న కేసులు, వస్తున్న విమర్శలతో మరింత పక్కాగా వైద్య సేవలను అందించడంతో పాటు, కఠిన చర్యలకు ఉపక్రమించింది. రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసిన తరవాత సిఎం కెసిఆర్‌ దీనిపై సమగ్రంగా చర్చించారు. కరోనా తీవ్రత ఉన్నా వైద్యం అందుతోదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల కమిటీకీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ ఉండనున్నారు. సభ్యులుగా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు కేటీఆర్‌, దయాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు మంత్రులు ఉ ండనున్నట్టు సమాచారం. రెండు రోజుల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పకదృందీ చర్యలపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నది. శుక్రవారం 1,410 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 2.37 లక్షల నమూనాలను పరీక్షించామని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,288 పడకలు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా శుక్రవారం 1,478 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలోనే 806 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి - జిల్లాలో 91, మేద్చల్‌ మల్కాజిగిరిలో 82, కరీంనగర్‌లో 77, వరంగల్‌ అర్బన్‌లో 51, పెద్దపల్లి, నల్లగొండలో 35 చొప్పున, కామారెడ్డిలో ౩1, రాజన్నసిరిసిల్లలో 27, మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో 23 చొప్పున, సూర్యాపేట, సంగారెడ్డిలో 20 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 19, ఖమ్మంలో 18, వికారాబాద్‌లో 17, మంచిర్యాలలో 15, నారాయణపేటలో 14, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీంఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌లో 11 చొప్పున, జనగామలో 10, సిద్దిపేటలో 8, జగిత్యాలలో 4, జయశంకర్‌భూపాలపల్లి, వనపర్తి, జోగుళాంబ గద్వాలలో 2 చొప్పున, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 1 కేసు చొప్పున వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కు చేరింది. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 403కు పెరిగింది.