మున్సిపల్‌ చైర్మన్‌ సన్న శ్రీశైలం యాదవ్‌ చేతుల మీదుగా వృద్దాప్య పించన్లు అందజేత - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 11, 2020

మున్సిపల్‌ చైర్మన్‌ సన్న శ్రీశైలం యాదవ్‌ చేతుల మీదుగా వృద్దాప్య పించన్లు అందజేత


 కుత్చుల్లాపూర్‌, శుభ తెలంగాణ : కుత్చులాపూర్‌ నియోజకవర్గం లోని కొంపల్లి మునిసిపాలిటీ పురపాలక సంఘం ఛైర్మన్‌ సన్న శ్రీశైలం యాదవ్‌ చేతులమీదుగా నూతనంగా మంజూరీ అయిన వృద్దాప్య, వితంతు మరియు సింగిల్‌ ఉమెన్‌ పెన్షన్‌ లబ్ధిదారు లకు పెన్షన్‌ అందచెయడం జరిగింది. ఈ సంధర్బంగా ఛైర్మన్‌ సన్న శ్రీశైలం యాదవ్‌ మాట్లాడు తూ కొంపల్లి మున్సిపాలిటీ లో పెన్షన్‌ కు అర్హులై యుండి పెన్షన్‌ రాకుండా వున్నవారు ఒక్కరు కూడా వుండరాదని, పెన్షను అర్హులైన ప్రతిఒక్కరిని గుర్తించి పెన్షన్‌ మంజూరీ చేయించుటకు చర్యలు గ్రైకొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సంధర్బంగా నూతనంగా పెన్షన్‌ మంజూరీ అయిన లబ్ధిదారులు అనిత, కమరున్నీసా, కోలంక జయలక్ష్మి, మరియు బుక్య రాధ ఛైర్మన్‌ మరియు కమిషనర్‌ చేతుల మీదుగా పెన్షన్‌ నగదు అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ యం.యన్‌. ఆర్‌. జ్యోతి మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.