పార్సిల్‌.. కొరియర్‌.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

పార్సిల్‌.. కొరియర్‌.. కార్గో సరుకు రవాణా ఏదైనా.. ఆర్టీసీ రెడీ

ఓ మారుమూల గ్రామంలో ఉండే ఓ తల్లి హైదరాబాద్‌లోని కొడుక్కు పచ్చళ్లు పంపాలనుకున్నది. సురక్షితంగా తరలించేందుకు ఆర్టీసీ ఉన్నది.ఓ పల్లెటూరి వ్యక్తి అమెజాన్‌లో వస్తువు బుక్‌చేస్తే పట్నంలోని తన దోస్త్‌ అడ్రస్‌ ఇవ్వాల్సివచ్చేది. ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ద్వారా ఆ గ్రామానికే అమెజాన్‌ పార్సిల్‌ వస్తుంది.హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీ తన డీలర్లకు సరుకును చేర్చాలంటే.. విస్తృతమైన, నమ్మకమైన వ్యవస్థ తెలంగాణ ఆర్టీసీ.
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రోడ్డురవాణాసంస్థ లాభాల వైపు అడుగులు వేస్తున్నది. పూర్తిస్థాయిలో వాణిజ్యపరంగా తన సేవలను విస్తరిస్తున్నది. పచ్చళ్ల దగ్గరి నుంచి ఫార్మా దాకా ప్రతి వస్తువునూ ప్రైవేట్‌ కంటే తక్కువ చార్జీకే రవాణాచేస్తున్నది. కార్పొరేట్‌ సంస్థల దగ్గరి నుంచి గ్రామా ల్లోని రైతుల వరకు సేవలందిస్తున్నది.   

882 కార్గో బస్సులు లక్ష్యంగా

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్గో సేవల కోసం 882 బస్సులకు అనుమతిచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు 8-9 టన్నుల వరకు ఉన్న వస్తువులను రవాణాచేసేందుకు తొలిదఫా 104 బస్సులను కార్గో సేవలకు అనుగుణంగా మార్చారు. లాక్‌డౌన్‌ సమయంలోనే బాలామృతం, నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర సామగ్రిని రవాణా చేశారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయశాఖ 30 బస్సులను వాడుకొంటున్నది. సరుకు రవాణాద్వారా ఇప్పటివరకు రూ. 2 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది. గత నెల 19న  మంత్రి పువ్వాడ అజయ్‌ ఆర్టీసీ పార్సిల్‌-కొరియర్‌-కార్గో సేవలను ప్రారంభించారు. దీంతోపాటు సరుకు రవాణా బస్సుల సంఖ్యను 126 కు పెంచారు. త్వరలో కొత్తగా 24 కార్గో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 

పలు కంపెనీలతో ఒప్పందం 

హైదరాబాద్‌లోని ఫాల్కన్‌ మోటర్ల ఏజెన్సీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ఆర్టీసీ.. ఆటో మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ తయారుచేసే కంపెనీలతో కూడా  సంప్రదింపులు జరుపుతున్నది. సింగరేణి, ఎఫ్‌సీఐ తదితర సంస్థలతోనూ ఆర్టీసీ అధికారులు జరిపిన చర్చలు సఫలమవుతుండటంతో 70-80 బస్సులను కార్గో సర్వీసులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Post Top Ad