వైరస్‌లకు పరిష్కారం ఫార్మా సిటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

వైరస్‌లకు పరిష్కారం ఫార్మా సిటీ

ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ఫార్మా సిటీ ప్రాధాన్యం పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరం లైఫ్‌ సైన్సెస్‌లో తనదైన గుర్తింపు పొందిందని తెలిపారు. హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఫార్మా సిటీ నగరాన్ని అంతర్జాతీయ పటంలో ప్రత్యేకంగా నిలుపగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో గురువారం హైదరాబాద్‌ ఫార్మాసిటీ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. 
రానున్న కొద్ది నెలల్లో ఫార్మా సిటీ మొదటి దశ ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు కేటీఆర్‌కు తెలిపారు. ఫార్మా సిటీకి కావాల్సిన రోడ్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి మంత్రి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఐదేండ్లలో ఏ సంవత్సరం, ఏ కార్యక్రమాలు చేపడుతారో, ఎలాంటి పురోగతి సాధించాబోతున్నారో తెలిపే టైంలైన్‌తో కూడిన నివేదికను సమర్పించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి కరోనాకి అవసరమైన మందులతో పాటు వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.