అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో ప్రారంభించే వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్ నో బాల్ నిర్ణయం థర్డ్ అంపైర్ (టీవీ అంపైర్) ప్రకటించనున్నారు. సూపర్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్‌ను థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తాడని ఐసీసీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్ అర్హత కోసం.. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్-ఐర్లాండ్ జట్ల మధ్య ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తో సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతేడాది భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్‌లో టీవీ అంపైర్ నోబాల్ ప్రకటించే విధానాన్ని ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ ఐసీసీ ఈ పద్ధతిని వినియోగించింది. ఈ రెండు సందర్భాల్లో సరైన ఫలితాలు రావడంతో.. సూపర్ లీగ్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ నిర్ణయంను ఐసీసీ థర్డ్ అంపైర్‌కే కట్టబెట్టింది. 2016లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో దీన్ని (నో బాల్ నిర్ణయం థర్డ్ అంపైర్‌దే) అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసారు. అయితే మరోసారి ఈ పద్దతిని భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో ప్రయోగించింది. 12 మ్యాచ్‌ల్లో బౌలర్లు 4,717 బంతులు సంధించగా.. గీత దాటిన 13 నోబాల్‌లను థర్డ్ అంపైర్ గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు కూడా వస్తున్నాయి. ఐసీసీ నిర్ణయంతో అన్‌ఫీల్డ్ అంపైర్ల పని మరింత సులువయింది. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )