మేడ్చల్ జిల్లా( శుభ తెలంగాణ) : కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టు కు కరోనా రావడంతో గత కొన్ని రోజులుగా ఆయన ఇంట్లోనే ఉండడం జరిగింది. మన బాధ్యత మనది అని గ్రహించి జర్నలిస్టు తెలంగాణ వర్క్మింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టి. డబ్యూ జె. ఎఫ్) కూకట్ పల్లి వారి అధ్వర్యంలో నేడు ఐదు వేల రూపాయల నగదు, డై ఫ్రూట్స్ వారికి అందించి వారికి మనోధైర్యాన్ని చేకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టు పట్ల మానవతా దృక్చథాన్ని చాటుకునే ఉద్దేశ్యంతో తమ వంతు సహకారం అందించామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ చ(క్రవర్తి మాట్లాడుతూ మనబాధ్యత మనది అని గుర్తించి బాధ్యతగా యూనియన్ సభ్యుల సహకారంతో జర్నలిస్టులకు అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కళ్యాణ చక్రవర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్,జాయింట్ సెక్రటరీ ఉమా మహేష్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నరేష్క్సుధాకర్,రమేష్ ,శ్రావణ్, బిక్షపతి, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. మహిళా విభాగం నాయకురాలు మాలతి ఫోన్ ద్వారా కరోనా బాధిత జర్నలిస్ట్‌ని పరామర్శించారు.
Post Top Ad
Thursday, July 30, 2020
జర్నలిస్టు లకు అండగా టి. డబ్యూ జె. ఎఫ్
Admin Details
Subha Telangana News