బూర్గంపాడు లో భారీ గంజాయి పట్టివేత - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

బూర్గంపాడు లో భారీ గంజాయి పట్టివేత


బూర్గంపాడు, (శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలోని యస్‌ఐ బాలకృష్ణ తన సిబ్బంది తో సోమవారం మధ్యాహ్నం సారపాక నుండి మణుగూరు క్రాస్‌ రోడ్డు వరకు కల్వర్టు తనిఖీ చేస్తుండగా 90 కేజీల గంజాయి పట్టు పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సారపాక నుండి మణుగూరు క్రాస్‌ రోడ్దు వరకు కల్వర్దు పుష్కర వనం దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ కొందరు వ్యక్తులు రెండు ఆటోలు, ఒక కారుతో అనుమాన స్పదంగా కనిపించగా వారిని పట్టుకొనుటకు పోలీసులు ప్రయత్నం చేయగా 5గురు వ్యక్తులు దొరకగా కొందరు పారిపొయ్యారు. వారి దగ్గర నుండి 47ప్యాకేట్స్‌ గంజాయి దిమ్మెలు, సుమారు 90 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ పదమూడు లక్షల యాబై వేలు ఉంటుందని తెలిపారు. వారందరిది సారపాక చెందిన వారుగా గుర్తించారు. బూర్గంపాడు ఎమ్మార్వో సమక్షంలో రెండు ఆటోలు, కారును, 5సెల్‌ఫోన్‌లు సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ప్రకటనలో తెలియజేశారు. త్వరలో పారిపోయిన వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

Post Top Ad