కేపిహెచ్‌బి డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

కేపిహెచ్‌బి డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభం

మేడ్చల్ ‌ జిల్లా (శుభ తెలంగాణ) : కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం కేపి హెచ్‌ బి డివిజన్లో 25 లక్షల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభించి పరిశీలించడం జరిగింది... ఇందులో ప్రధానంగా షటిల్‌ కోర్ట్‌ షెడ్‌ మరియు ఫుట్‌ పాత్‌ నిర్మాణం ...జిమ్‌ బ్యాలెన్స్‌ సెర్మినల్‌ హాల్‌ పనులు బ్యాలెన్స్‌ పనులకు ఈ నిధులు కేటాయించడం జరిగింది... ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వం టి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం అని కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఎక్కడ అభివృద్ధి ఆగరాదు అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని... అలాగే ప్రజలు కూడా ఇబ్బంది ఉన్న ఎడల... నేరుగా మా క్యాంపు కార్యాలయం నందు సంప్రదించవచ్చని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు....ఈ కార్యక్రమంలో కే పి హెచ్‌ బి డివిజన్‌ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు... జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు... అలాగే కేపీహెచ్చీ డివిజన్లోని కోవిడ్‌19 పరీక్షా కేంద్రాన్ని కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనిఖీ చేశారు ..ఈ సందర్భంగా అక్కడున్న వైద్యులకు పరీక్ష ఫలితాలను వెంటనే ప్రజలకు అందించాలని తగిన జాగ్రత్తలు సూచించాలని కోరడం జరిగింది...అలాగే బోయిన్పల్లి కెపిహెచ్చి డివిజన్లో తానే స్వయంగా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.