జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు స్టేషన్ బెయిల్‌పై విడుదల.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు స్టేషన్ బెయిల్‌పై విడుదల..

ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ జర్నలిస్ట్ చిన్ని వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి విడుదలయ్యారు. ఉదయం ఖమ్మంలో మార్నింగ్ వాక్‌కి బయల్దేరిన ఆయన ఎంతకీ తిరగిరాలేదు. దీంతో కిడ్నాప్ అయ్యారని అనుకొన్నారు. కానీ ఇటీవల ఓ కథనంపై ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో జర్నలిస్టు నేతలు జూబ్లీహిల్స్ స్టేషన్ చేరుకోవడం, ఇతరులు మద్దతు ఇవ్వడంతో అనంచిన్ని రాత్రి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఉదయం 11 గంటల వరకు సమాచారం లభించలేదు. వెంకటేశ్వరరావు ఏమయ్యారు? అనే ఉత్కంఠ నెలకొంది. కిడ్నాప్‌నకు గురయ్యారని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అదే జరిగితే ఊరుకోబోం అని ప్రకటనలు కూడా వచ్చాయి.
ఘటనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని టీజేఎస్ఎస్ ప్రణాళిక ప్రకటించింది. అయితే మధ్యాహ్నం తరువాత వెంకటేశ్వర రావు పై కేసు నమోదు చేసినట్లు సమాచారం వచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో సీఎం కేసీఆర్ కు కరోనా అనే వార్త ప్రచురించినందుకు వెంకటేశ్వరరావు తదితరులను అదుపులోకి తీసుకున్నట్లు చివరకు పోలీసులు చెప్పాల్సి వచ్చింది.