రాజగృహపై దాడిని ఖండిస్తున్సా. - భీమ్‌ ఆర్మీ (భారత్‌ ఏక్తా మిషన్‌)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుజీత్‌ రవణ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

రాజగృహపై దాడిని ఖండిస్తున్సా. - భీమ్‌ ఆర్మీ (భారత్‌ ఏక్తా మిషన్‌)తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుజీత్‌ రవణ్‌


హైదరాబాద్‌, జూన్‌ 8(శుభ తెలంగాణ) : ముంబైలోని దాక్టర్‌ అంబేడ్కర్‌ గారి రాజ గృహ పై దుండుగులు జరిపిన దాడి అత్యంత అమానుషమైన చర్య రాజగ్రుహ పైన దాడి చేసి పరమ పవిత్రమై రాజగ్రుహను ద్వంసం చేయడానికి ప్రయత్నించి పాక్షికంగా నష్టం కలిగించారు. ప్రపంచంలో అన్ని దేశాల నుంచి నిత్యం వేలమంది బాబాసాహేబ్‌ బావజాలం కలిగిన వారు మరియు ఆయన అనుచరులు ప్రతి నిత్యం” రాజగ్రుహ” బాబాసాహేబ్‌ గృహం ను సందర్శించడం జరుగుతుంది అని. ఈ సందర్భంగా సుజిత్‌ రావణ్‌ మాట్లాడుతూ రాజగ్భృహలోదాక్టర్‌ అంబేద్కర్‌ గారు సమకూర్చుకున్న కొన్ని వేల పుస్తకాలు మరియు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువులు భద్రపరిచారు అలాంటి ప్రపంచ విశిష్టత కలిగిన భవనం పైన దాడి చేయడం అత్యంత క్రూరమైన మరియు కిరాతకమైన చర్య అని అన్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలి మరియు రాజగ్భహ కు పటిష్టమైన భద్రతను కలిపించాలి సి.సి.కెమెరాలను ఎక్కువ సంఖ్యలో అమర్చాలి మరియు ఎక్కువ మంది పోలిసులను కాపలాగా ఉ ౦చాలి. ఆయన ఇంటి పైన దాడి చేయడం వలన ఏమీ సాదించలేరు. ఆయన భావజాలం ప్రపంచంలో నలుమూలల వ్యాపించింది. భారత దేశంలో అ భావజాలపు వృక్షం దృడమైన వెల్లూనుకుంటుంది దాని పలితాలు స్వేచ్చ, సమానత్వం, విద్య, ఉద్యోగ, ఉపాధి, మేరుగైన జీవన విధానం, ఆర్థిక స్వావలంబన, సమసమాజ స్థాపన దిశగా వేగంగా పరుగులు తిస్తుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది అని అన్నారు.