సచివాలయ కూల్చివేత కవరేజ్ పై ఆంక్షలు ఎందుకు...? - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

సచివాలయ కూల్చివేత కవరేజ్ పై ఆంక్షలు ఎందుకు...?


హైదరాబాద్ జూలై 23(శుభ తెలంగాణ) సచివాలయం కూల్చివేతలను కవరేజ్ చేయడానికి మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతల అంశంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నా రని హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 180ఇ ప్రకారం సైట్లో పని చేసే వారు మాత్రమే ఉండాలి.. కానీ మిగిలిన వారు ఉండటానికి అనుమతి లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సచివాలయం కూల్చివేతలను కవరేజ్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. కూల్చివేతల వద్దకు ఎవ్వరిని అనుమతించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది కోవిడ్ బులిటెన్లను ఏవిధంగా విడుదల చేస్తున్నారో కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ కూడా అలానే విడుదల చేయొచ్చు కదా అని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే 95 శాతం కూల్చివేత పనులు పూర్తి అయ్యాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ అంశం గురించి ప్రభుత్వాన్ని సంప్రదించి సోమవారం చెప్తామని ఏజీ కోర్టుకు తెలిపారు అయితే సోమవారం వరకు గడువు ఇవ్వలేమన్న హైకోర్టు.. రేపటిలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ... తదుపరి విచారణను కోర్టు శు క్రవారానికి వాయిదా వేసింది. పదేపదే వాయిదాలు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది