డాక్టర్ఆ ర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి అడుగు జాడల్లో నడవాలని.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

డాక్టర్ఆ ర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి అడుగు జాడల్లో నడవాలని....


కామారెడ్డి జిల్లా(శుభ తెలంగాణ) :జుక్కల్ మండల్ సవర్గావ్ గ్రామం లో యువజన నాయకుడు దిలీప్ ఆధ్వర్యంలో ఉచితంగా మహనీయుల పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ తెలంగాణలోగురుకుల్లో విద్యావ్యవస్థను పటిష్టం గా తీర్చిదిద్ది తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్న డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి అడుగు జాడల్లో నడవాలని దృఢ సంకల్పంతో మహనీయుల పుస్తకాలు గ్రామంలోని విద్యార్థులకు యువతకు, మహిళలకు పంపిణీ చేశామని అన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాలలో మాత్మ జ్యోతిరావుపులే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గౌతం బుద్దా మత రమాయి వారి యొక్క విజ్ఞానం ప్రజలందరూ తెలుసు కోవాలని చైతన్యవంతులు కావాలని ఆకాంక్షతోనే ఈ మహా కార్యక్రమా న్ని నిర్వహించారని తెలిపారు