కరోనా వ్యాక్సిన్ ఇక్కడి నుంచే-మంత్రి కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

కరోనా వ్యాక్సిన్ ఇక్కడి నుంచే-మంత్రి కేటీఆర్

కరోనా నివారణకు తయారయ్యే మందులతో పాటు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతున్నదని మంత్రి కే. తారకరామారావు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో హైదరాబాద్ స్థానాన్ని ఫార్మాసిటీ భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రాధాన్యత పెరిగిందని అభిప్రాయపడ్డారు.    అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.