హైదరాబాద్, జూలై 09(శుభ తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలను రద్దు చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో 1.47 లక్షల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆమె చెప్పారు. కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణత అయినట్లు వీళ్లకు సర్టిఫికెట్స్ జారీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. వీళ్లందరూ ఈ నెల31 వరకూ కూడా కాలేజీల్లో చేరొచ్చని సబిత చెప్పారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులను కూడా రీకౌంటింగ్‌కు దర ఖాస్తు చేసుకోమని గతంలో చెప్పామని ఆమెతెలిపారు. 73 వేల మంది విద్యార్థులు రీకౌంటింగ్‌కు, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు చేశారని వెల్లడించారు. 10రోజుల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసి ఫలితాలు ఇస్తామని సబిత స్పష్టం చేశారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని సీఎంనిర్ణయం తీసుకున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులం దరినీ పాస్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇపుడు పాసైన వారందరినీ కంపార్ట్ మెంట్లలో పాసైనట్టుగా గుర్తించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. ఈ మేరకు విద్యార్థులకు జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలు జారీచేస్తారని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తొలి దశలోనే 1 నుంచి 9 వరకు విద్యార్థులను పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి అందరినీ పాస్ చేస్తున్నట్టు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.