దేశంతో పోల్చితే హైదరాబాద్‌లో.. కరోనా ప్రభావం తక్కువే ..- హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

దేశంతో పోల్చితే హైదరాబాద్‌లో.. కరోనా ప్రభావం తక్కువే ..- హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌


హైదరాబాద్‌, జూలై 08(శుభ తెలంగాణ): దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా తీవ్రత తక్కు వగానే ఉందని హైదరాబాద్‌ పోలీ సు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువ గానే ఉన్నదని పేర్కొన్నారు. అంబర్‌పేట పోలీసు మైదానంలో పోలీసు వాహనాలకు శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. కఫ్స్‌ సంస్థ సహకారంతో అన్ని పోలీసు వాహనాలను శానిట్రైజేషన్‌ చేయ నున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి పోలీసులు తమ విధుల్లో కఠోరంగా (శ్రమి స్తున్నారని వెల్లడిం చారు. కరోనాకు భయపడ కుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. నియమాలు, వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా నుంచి బయట పడవచ్చని తెలిపారు.