నల్లగొండ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

నల్లగొండ జిల్లా కేంద్రంలో సఖి కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి


నల్లగొండ,జూలై 23(శుభ తెలంగాణ): మహిళాభ్యుదయమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నల్లగొండ నియోజక వర్గ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. అనేక కార్యక్రమాలే ఇందుకు నిదర్శన మని అన్నారు.జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సఖి కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి శంఖుస్థాపనచేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందులలో ఉన్న మహిళల రక్షణ కోసం,వారి సమస్యలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సఖి కేంద్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నల్గొండ మున్సిపల్ పల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ కౌన్సిలర్ పిల్లి రామరాజు, తదితరులు పాల్గొన్నారు