ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

ఘనంగా పీవీ శత జయంతి వేడుకలు


సిద్దిపేట జిల్లా (శుభ తెలంగాణ) : సిద్దిపేట జిల్లా కోహెడ మండల్‌ కేంద్రంలో మండల్‌ పరిషత్‌ కార్యాలయంలో హుస్నాబాద్‌ అసెంబ్లీ శాసన సభ్యులు వొడితేల సతీష్‌ కుమార్‌ భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీశ్రీశ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు పివి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులుఅర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన మహనీయులకు తగిన గుర్తింపు వచ్చిందని వారి శతజయంతి ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం చాలా శు భపరిణామం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు పివి నామకరణం చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వ్యాప్తంగా గత రెండు ఏళ్లుగా సైకిల్‌ యాత్ర చేపట్టిన రాజుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొక్కుల కీర్తిటీఆరెస్‌ రాష్ట్ర నాయకులు కర్ర ఛీహరి, వైస్‌ ఎంపిపి తడుకల రాజిరెడ్డి, ఎంపీడీఓ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పలు (గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొననున్నారు.