రైతుసంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

రైతుసంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్


కరీనంగర్‌, జూలై 28(శుభ తెలంగాణ): దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక రకాల ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రైతులకు చేయని పనిలేదన్నారు. ఉచిత కరెంట్‌ మొదలు, బీమా వరకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గరైపల్లిలో ఆయన రైతువేదిక నిర్మాణానికి పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే రైతుకు, ఉపాధ్యాయుడికి అత్యంత గౌరవం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులకు సమున్నత గౌరవం లభించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పని చేస్తున్నారని చెప్పారు. రైతు వేదికల నిర్మాణం ఒక చారిత్రాత్మక అవసరం అన్నారు. రైతు వేదికల నిర్మాణం ద్వారా దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకునేందుకు రైతులకు వీలు కలుగుతుందన్నారు. ప్రతి ఐదు వేల మంది రైతులకు ఒక క్లస్టర్‌ గా విభజించి రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ రైతు వేదికలు రాబోయే రోజుల్లో గ్రామాలోని రైతుల ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాయన్నారు. రైతు వేదికలు అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తాయని ఆయన వివరించారు. రైతులు రాష్ట్రంలో సంతోషంగా, ఒక్క రైతుకు నష్టపోకుండా లాభసాటి వ్యవసాయం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం అన్నారు. ఇదే సందర్భంలో మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని వివరించారు. విరివిగా మొక్కలు నాటి భవిష్యత్‌ తరాలకు వనాలను ఆస్తిగా అందించాలని మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. మహిళలు కోరుకున్న పూల, పండ్ల మొక్కలను ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈసారి జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటుతామన్నారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉ దన్నారు. బ్లాక్‌ ప్లాంటేషన్‌, మియావాకి, అవెన్యూ ప్లాంటేషన్‌ పద్ధతుల్లో మొక్కలు నాటుతామన్నారు. ప్రతి ఇంటికీ అందించే ఆరు మొక్కలను యజమానులు నాటి సంరక్షించాలని కోరారు. అన్ని వీధుల్లోనూ అధిక సంఖ్యలో మొక్కలు నాటి పచ్చని నగరంగా మార్చాలన్నారు.