ఆత్మ కమిటీ చైర్మన్‌ గడిల కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన... రైతు కమిటీ సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 31, 2020

ఆత్మ కమిటీ చైర్మన్‌ గడిల కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన... రైతు కమిటీ సమావేశంసంగారెడ్డి జిల్లా : పటాన్చెరులో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకుని వచ్చినట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెంమహిపాల్‌ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్సెరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ గడిల కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన రైతు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియంత్రిత వ్యవ సాయ సాగు విధానం ద్వారా ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణ సాగు పెరిగిందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి కూతవేటు దూరంలో ఉన్న పటాన్సెరు నియోజక వర్గంలో ఉద్యానవన పంటల పైన రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఆత్మ కమిటీ పాలకమండలి, వ్యవసాయశాఖ అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌,మార్మెట్‌ కమిటీ వైర్మన్‌ హారిక విజయ్‌ కుమార్‌. జెడ్పీటీసీ సుధాకర్‌ రెడ్డి, ఎంపీపీ సుష్మాశ్రీ,వేణుగోపాల్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.