హైదరాబాద్, 11జులై (శుభ తెలంగాణ) : ప్రపంచంలో ని అన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా చరిత్రలో మొదటిసారి భక్తులు లేకుండా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో సికింద్రాబాద్ శ్రీ ఉ జ్ఞయిని మహంకాళి బోనాల ఉ త్సవాలను నిర్వహించాల్సి వస్తుందని మంత్రి శ్రీ తలసాని థీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మహంకాళి ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని అన్నారు. ప్రజలు బోనాలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం వివిధ ఆలయాలకు నిధులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలు దేశంలోనే అతి పెద్ద పండుగ అన్నారు. బోనాలు వచ్చాయంటే ప్రతి ఇల్లు బంధువులు, సన్నిహితుల రాకతో ఎంతో సందడిగా మారుతాయని చెప్పారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థలు అందిస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. మాయదారి మహమ్మారి కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ సంవత్సరం బోనాలు నిర్వహిస్తున్నామని, భక్తులు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి ఏసీపీ వినోద్ తదితరులు పాల్గొన్నారు.