బీజింగ్ : కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు గాను విధించిన లాక్డౌన్లో భాగంగా 6 నెలలు మూతబడిన తరువాత చైనాలో సినిమా థియేటర్లు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సోమవారం నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తి ఇప్పుడు తగ్గిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా అధికార యంత్రాంగం తెలియజేసింది. అయితే సినిమా థియేటర్లలో కఠిన నిWORLDబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు. లోపలికి ప్రవేశించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతో పాటు, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కు తప్పనిసరి చేయబడ్డాయి. సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అదే విధంగా కేవలం 30శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని నిబంధనలు జారీ చేశారు. కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న చైనాలో సినిమాలకు ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్ ఉంది. 2019లో చైనా బాక్సాఫీస్ 29.2 బిలియన్ (2లక్షల కోట్లకు పైనే) వసూలు చేసింది. అయితే థియేటర్లు పునఃప్రారంభించిన తరువాత ఇంత మొత్తంలో మార్కెట్ ఉండదని స్థానిక వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )