కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం చిగురుటాకుల వణికిపోతున్నది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను సామూహింగా ఖననం చేస్తున్న పరిస్థితి కూడా ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. ఈ తరుణంలో కరోనా సోకిన వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్ల సేవలను సర్కారు గుర్తించి వారిని సన్మానిస్తున్నది. జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా కరోనా వ్యాధి నిర్మూలనకై పోరాడుతున్న మహబూబ్ నగర్ జనరల్ దవాఖాన వైద్య బృందానికి పూలవర్షంతో సన్మానం చేశారు.
మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రామ్ కిషన్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ జీవన్, గైనకాలజీ హెచ్.ఓడి. రాధ, ఇతర వైద్యులు, సిబ్బందిని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పూల వర్షం కురిపించి సన్మానించారు. కరోనా కట్టడిలో వైద్యులు నిర్వర్తిస్తున్న పాత్ర ఎంతో విలువైనదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.