హైదరాబాద్, జూలై 23(శుభ తెలంగాణ) తెలంగాణ యువనేత, మంత్రి కేటీఆర్ యూత్ ఐకాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల అభివృద్ధిపై రూపొందించిన డాక్యు మెంటరీని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పలువురు టీఆర్ఎస్ నేతలు హాజర య్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కేటీఆర్ అతి తక్కువ సమయంలోబటీ మంత్రిగా తన ప్రతిభను ప్రపంచానికి చాటార న్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా నిరంతరం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్ జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేవుడు, ప్రకృతి కూడా ఈ ప్రభుత్వానికి సహకరి స్తోందని మంత్రి తలసాని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని తలసాని మండిపడ్డారు