ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ నూతన కార్యవర్గం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ నూతన కార్యవర్గం

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) సింగపూర్ విభాగానికి జూలై 7న  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అంతర్జాతీయ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. వామ్ సింగపూర్ విభాగానికి అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా పట్టూరి కిరణ్ కుమార్, కోశాధికారిగా వుద్ధగిరి సతీష్, ఉపాధ్యక్షుడిగా కంకిపాటి శశిధర్ తో కూడిన నూతన కార్యవర్గాన్ని నియమించారు. అందరి సహాయ సహకారాలతో సమిష్టిగా మరిన్ని కార్యక్రమాలను సింగపూర్ లో నివశించే ఆర్యవైశ్యుల కోసం సింగపూర్ విభాగం తరుఫున చేపడతామని నూతన అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు.